సిద్ధిపేట జిల్లాలో కొమురవెళ్లి మండల కేంద్రంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెళ్లి మల్లన్న స్వామిని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో 14 ఎంపీ సీట్లు గెలిచి, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మల్లన్నకు ముడుపు కట్టారు.