Thursday, April 17, 2025
HomeNewsTelanganaఒవైసీకి భయపడి విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

మావల్లే తెలంగాణ వచ్చింది. మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే…ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్ర్యం ఎందుకు రాలేదు? దానికి కారకులెవరు? తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపోవడం విడ్డూరమన్నారు. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. ‘‘పిడెకెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం. ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఉద్యమ పార్టీ అవుతుందా?’’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవన కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ
యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఫొటో ఎగ్జిబిషన్’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఈ ఫొటో ఎగ్జిబిషన్ లక్ష్యం. కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల పోరాటాల చరిత్రను స్మరించుకునే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలుగుతోంది.’’అని చెప్పారు.

అట్లాగే బైరాన్ పల్లి సంఘటన, రజాకార్ల ఆక్రుత్యాలతోపాటు సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగించిన ప్రధాన సంఘటనలతో ఈ ఎగ్జిబిషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం లభించిందన్నారు. గతం ఎట్లుందో తెలుసుకోవడమంటే భవిష్యత్తుకు దారిని నిర్మించుకోవడమేనని, గతాన్ని మర్చిపోయిన జాతి ఎన్నడూ సవ్యంగా ముందుకు పోదన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సర్దార్‌ వల్లభాయి పటేల్‌ చేసిన సాహసాన్ని, పోరాటా యోధులను స్మరించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విధానాలను దేశంలో ఇంకా అవలంబించి ఉంటే భారత దేశం 10 ముక్కలయ్యేదన్నారు. సర్దార్ పటేల్ దేశంలోని 562 సంస్థానాలను విలీనం చేసిన దేశభక్తుడని కొనియాడారు. పటేల్ ముమ్మాటికీ తమకు అరాధ్యుడేనని, బీజేపీ అధికారలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఏటా ‘తెలంగాణ విమోచన దినోత్సవాల’ పేరుతోనే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. అట్లాగే హైదరాబాద్ లో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ విమోచన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అరుదైన చిత్రాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటున్నందున నగర ప్రజలు వీక్షించాలనీ కోరారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments