గిరిజన సంక్షేమ శాఖ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఘనంగా వేడుకలను నిర్వహించింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కుమ్రంభీమ్ ఆదివాసి భవన్ లో జరిగిన ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, పంచాయితీరాజ్ శాఖా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో నివసిస్తున్న ఆదివాసులది ప్రత్యేకమైన సంస్కృతి అని, ఈ సంస్కృతి పరిరక్షణకు ప్రస్తుత ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నద’ని కొనియాడారు.
మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి ప్రత్యేకమైనది, ప్రాచీనమైనది, శాస్త్రీయమైనదని, మంత్రి సీతక్క అన్నారు. ఒకప్పుడు ధనికులు చీదరించుకున్నఆదివాసీ సంస్కృతే ఇప్పుడు శాస్త్రీయమైనదని, ఆరోగ్యకరమైనదని పాటిస్తున్నారని అన్నారు. ఇప్ప పువ్వులను తీసుకుంటే… ఇప్ప పువ్వు, కాయల నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలు, నూనెలు, చివరికి కల్లును కూడా ఆదివాసీలు తయారు చేసుకుంటారు. కాబట్టి ఇప్ప పువ్వుల చెట్టు వంటి ఎన్నో రకాల చెట్లను ఆదివాసీలు కొట్టక అటవీ సంరక్షణ చేస్తుంటారు. ఇలాంటి ఆదివాసీ జీవనమే నాగరిక ప్రజలకు కూడా ఆదర్శం, ఆచరణీయం అని ఆమె అన్నారు.
ఈ వేడుకలలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన తెగలకు చెందిన ఆదివాసీ కళాకారులు తమ ఆటపాటలతో అతిథులను ఆహ్వానం ఘనంగా ఆదివాసీ దినోత్సవంపలికారు. అనంతరం అతిథులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద, కుమ్రం భీమ్, రాంజీ గోండ్ విగ్రహాల వద్ద పూజలు చేశారు. ఆ తరువాత ఆదివాసీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉత్పత్తులు, హస్తకళలను తిలకించి కొన్ని కళాఖండాలను కొనుగోలు చేశారు. కార్యక్రమాలలో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులు, ఆటగాళ్లు, కుటీర పరిశ్రమల బృందాలను అతిథులు సన్మానించారు.