Telangana Elections: ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దం- సీఎస్ శాంతికుమారి

ఈ నెల 30న తెలంగాణతో పాటు దేశంలోని మరో 4 రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎసి పాండే, అరుణ్ గోయెల్‌లు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దంగా ఉందని, తెలంగాణలో శాంతి బధ్రతలు అదుపులో ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారికి శాంతి కుమారి వివరించారు. ఇప్పటి కే తెలంగాణ సరిహధ్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్ట్ లను కట్టు దిట్టం చేశామని వివరించారు.

రాష్ట్రంలో నిఘా పెంచడం జరిగిందని దీని ఫలితంగా రూ. 385 కోట్ల మేర నగదు జప్తు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాలు 154 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయని ఆమె తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో సమర్థవంతమైన సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ ఈసీ అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్‌ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో సిటి అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, సిఇఒ తెలంగాణ వికాస్ రాజ్, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, అదనపు డిజి మహేష్ భగవత్, జిఎడి సెక్రటరీ వి శేషాద్రి, సిఆర్‌పిఎఫ్ ఐజి చారు సిన్హా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img