సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. చేర్యాల మండలానికి 1.60 కోట్ల విలువైన సీసీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సాంక్షన్ చేయించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలతో.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సుంకరి మల్లేష్ గౌడ్ సూచనల మేరకు ఆకునూరులో రోడ్డు పనులు చేస్తున్నామని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు వంగాల శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, గ్రామ ఉపాధ్యక్షుడు శనిగరం రమేశ్, నాయకులు ప్రశాంత్, మంతపురి సత్యనారాయణ, తోళ్ల సత్యం, కోతి యేబు, కంతుల రాజు, ఎండి అక్బర్, శిగుల్ల పోషయ్య, శిగుల్ల బాలరాజు, పాల రాజయ్య, పౌడాల హరికృష్ణ, తౌట విజయ్, అమరగొండ బీరయ్య, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షుడు ముచ్చాల వంశీ, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.