మూడు రోజుల్లోనే వరి ధాన్యం రైతుల ఖాతాల్లో నగదు జమ: డిప్యూటీ సీఎం భట్టి

వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదని, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు. రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బిజెపి నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. బీ ఆర్ఎస్ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైనది కాదు, అత ఏడాది ఇదే సమయంలో నేను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారు, గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదు ఈ విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారు అని వివరించారు. మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు.

ఇక ధాన్యానికి భువనస్ విషయానికి వస్తే సన్నాలకు 500 రూపాయల బోనస్ తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా ప్రయత్నం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దుష్టశక్తు ల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆచరణలో పెట్టారని, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నాం దీనికి కారణం రాజీవ్ గాంధీ చూపిన మార్గము.. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

Share the post

Hot this week

‘రెడ్ ఫ్లవర్’ సినిమా కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా...

నటి కాదంబరి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి...

ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నారా? లేదా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా?...

డిప్యూటీ సీఎం భట్టికి అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల...

రేపే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

తెలంగాణ సచివాల‌యం ముందు దివంగ‌త మాజీ ప్ర‌ధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని...

Topics

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా బొమ్మ మహేశ్‌ కుమార్‌...

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. రెండు రోజుల్లో రాజీనామా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు....

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల వెలికితీత పనులు

ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు పనులు నిరాటంకంగా...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img