తెలంగాణలో ఎన్నికల ఎప్పుడు జరుగనున్నాయి అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రాకారం అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే, ఎన్నికలు మరో ఆరు నెలల తర్వాత అంటే ఎప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే దానిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలోనే ఒక క్లారిటీ వస్తుందని అన్నారు. ప్రగతి భవన్ లో మీడియాతో చిట్ చాట్ లో బాగంగా కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు.
జమిలి ఎన్నికలు వచ్చినా కూడా ఇంకా తమకు ఆపద్దర్మ ప్రభుత్వంగా కొనసాగే అవకాశం ఉండడం వల్ల మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతామని కేటీఆర్ తెలిపారు. జమిలి వచ్చినా.. రాకపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి 90కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. మళ్లీ రాష్ట్రానికి కేసీఆరే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నరని అన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రజలకు అందించిన పథకాలను ప్రజలే వివరిస్తున్నరని అన్నారు.
ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు స్పష్టత ఉందని.. ప్రతిపక్షాలే అనవసర రాధ్దాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతిపక్షాలు పోటీ పడేది కేవలం రెండో స్థానానికి మాత్రమే అని ప్రతిపక్షాలను విమర్శించారు. సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే.. వారు తమ పార్టీలోకి వస్తారని ఊహించిన ప్రతిపక్షాల ఆశలు గల్లంతు అయ్యాయని తెలిపారు. కేసీర్ నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపై అధినేతకు ఉన్న నమ్మకంతోనే సిట్టింగ్ లకు మళ్లీ సీట్లు కేటీయించారని పేర్కోన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి గెలవడం ఖాయం.. కేసీర్ మూడోసారి మఖ్యమంత్రి కావడం ఖాయం అని మంత్రి కేటీఆర్ అన్నరు.
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీల ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎకరో కనీసం వారికి అయినా తెలుసా అని ఎద్దేవా చేశారు. ముఖ్యంత్రులను మార్చడానికి మత కల్లోలాలను సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా.. తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు.