సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులే తమపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లపై తగు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డీసీపీకి బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు సుశీల రెడ్డి, మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత, కీర్తిలతా గౌడ్, మంజుల ఫిర్యాదు చేశారు.