బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేస్తున్న దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఇప్పటికే సభాపతి గడ్డం ప్రసాద్‌కు ఈవిషయంపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.