మల్కాజ్‌గిరితో పాటు పెండింగ్‌లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థలను ప్రకటించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసంది. ఇప్పటికే పెండంగ్‌లో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ తో పాటు మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు అభ్యర్థలను ప్రకటించవలసి ఉంది. జనగామ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని బుజ్జగించి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కన్ఫాం చేసినట్టు సమాచారం.
అదేవిదంగా నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ సీట్లపై అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు సర్వే రిపోర్టులు తెప్పించుకొని ఆశావహుల బలాబలాలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు మల్కాజ్‌గిరితో పాటు తన కుమారునికి మెదక్ అసెంబ్లీ సీటును డిమాండ్ చేసినా.. అధిష్టానం కేవలం మల్కాజ్‌గిరి టికెట్ ఒక్కటే కేటాయించడంతో హన్మంతారావు టికెట్ తిరస్కరించి, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మల్కాజ్‌గిరిలో కూడా అభ్యర్ధి ఎంపిక బీఆర్ఎస్‌కు అనివార్యంగా మారింది. పోటీపడుతున్న అభ్యర్థుల వివరాలను బీఆర్ఎస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. వారి వ్యక్తిగత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని టికెట్ కేటాయించే అవకాశం ఉంది. వారంలోపే పెండంగ్‌లో ఉన్న ఐదు స్థానాలకు అభ్యర్ధలను ఫైనల్ చేసి, ప్రకటించే అవకాశం ఉంది.