దివంగత బీఆర్ఎస్ నాయకుడు, ఆకూనూరు మాజీ ఎంపీటీసీ శిగుల్ల బాలామల్లు వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన నిత్యం ప్రజా జీవితంలో ఉండే వారని, ఆయన లోటు పార్టీకీ తీరనిదని అన్నారు. ముఖ్యంగా కురుమ సమాజానికి ఆయన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. వివాద రహితుడుగా ఉండేవాడని, అందరినీ నవ్వుతూ ఆప్యాయంగా పలకిరించేవారని పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి చురుకుగా పాల్గొనే వారు. 2014 లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుండి MPTC గా గెలుపొందారు. అనారోగ్య కారణాల వల్ల 2017 లో ఆయన మరణించారు