గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా సోషల్ మీడియా ఎక్స్, ఇన్స్టా లలోకి ప్రవేశించారు. తన ఖాతాలను ప్రారంభించిన కొద్దిసేపట్లోనే వేలల్లో ఫాలోవర్లు వచ్చి చేరుతున్నారు. ఇక మాజీ సీఎం పార్టీ విషయాలతో పాటు, ఇతర విషయాలను కూడా ప్రజలతో, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకోనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎప్రిల్ 27న తన సోషల్ మీడియాలోకి కేసీఆర్ అరంగేట్రం చేశారు. @KCRBRSpresident పేరుతో ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాలలో ఖాతాలను ప్రారంభించారు. ఎక్స్ లో మొదటి పోస్ట్ ను కూడా కేసీఆర్ పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN
— KCR (@KCRBRSPresident) April 27, 2024