...

గాంధీలు చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారు: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా నిర్వహించిన రోడ్ షో లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. మంచి వాళ్లను ఎన్నుకుందామా లేదా ముంచేవాళ్లను ఎన్నుకుందామా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. “మూడు గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా లేదా 24 గంటలు కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? నిరంతరం నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే ఇస్తామని చెప్తున్నారు. ఐదు గంటల కరెంటు కావాలా లేదా 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ?” అన్న అంశాలపై ఆలోచన చేయాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసినట్లు చేసిందని పేర్కొన్నారు. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోఫిటిషన్లు జారీ చేశామని, ప్రైవేటు రంగంలో 30 లక్షల ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు లేదని, పొలాలకు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదని, మళ్లీ పొరపాటు చేస్తే పాత రోజుల్లో అనుభవించిన గతే పడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, పెన్షన్లు, కరెంటు పోతాయని, పిల్లలకు భవిష్యత్తు ఉండదని, చాలా దారుణమైన పరిస్థితి నెలకొంటుందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల పాటు చూసిన దారుణ పరిస్థితిని చూశామని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం పేరిట నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ. 15 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు మొత్తం రూ. 16 వేలకు పెరుగుతుందని, ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కోరుట్లలో వెయ్యి ఫాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ లక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బోధన్ లో షకీల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Share the post

Hot this week

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

Topics

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

BJP Membership Drive: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership...

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాగుల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా అప్రమత్తంగా...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.