నెల 28వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యప్రదేశ్ ఓబీసీ హక్కలు ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఫ్రంట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే “పీడిత్ అధికార్ యాత్ర”ను ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు.
ఓబీసీ హక్కల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్ కు మద్ధతుగా ఎమ్మెల్సీ కవిత అక్కడి ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కలు, డిమాండ్ల సాధన కోసం మధ్య ప్రదేశ్ కేంద్రంలో దామోదర్ సింగ్ యాదవ్ పోరాటాన్ని సాగిస్తున్నారు.