బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనికవాస్ రెడ్డతో కలిసి ముఖ్యమంత్రిని కలవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సమేతంగా కలిశారు. గత కొద్దిరోజులుగా వెంకట్రావు పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంట్రావు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటున్నారు. ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి.