తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజుకు మూలం నవంబర్ 29 కి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. తన ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారని అన్నారు. నవంబర్ 29 న ప్రతి సంవత్సరం తెలంగాణలో దీక్షా దివస్ ను జరుపుకుంటున్నామని.. ఈ సంవత్సరం కూడా దీక్షా దివస్ ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు ఘనంగా నిర్వహించాని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పోలింగ్ ముందురోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు దీక్షా దివస్ రోజు, తెలంగాణ జెండాలు ఎగుర వేయటం, పార్టీ తరపున పలు సేవా కార్యక్రమాలు చేయటం లాంటి కార్యక్రమాలు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
రైతు బంధు కొత్త పథకం కాదని.. రేవంత్ రెడ్డికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ కు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే.. పీఎం కిసాన్ యోజనపై రేవంత్ మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గోశామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పేటడమే దీనికి నిదర్శనమని ఆరోపించారు.ఈసారి గోశామహల్ లో రాజాసింగ్ ను, కరీంనగర్ లో బండి సంజయ్ ను, కోరుట్లలో ధర్మపురి అరవింద్ ను ఒడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకుండా చేస్తామని కేటీఆర్ అన్నారు. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాకు భర్తీ చేసిన రాష్ట్రం ఏదీ లేదని అన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డిలు రాజకీయ నిరుద్యోగులని.. నిరుద్యోగులు వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. డిసెంబర్ 4న స్వయంగా తానే అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ ను రూపొందిస్తామని కేటీఆర్ అన్నారు.