జగిత్యాల రూరల్ మండలం సంఘం పల్లి గ్రామానికి చెందిన పలువరు యువకులు, మహిళలు మరియు జగిత్యాల పట్టణానికి చెందిన మేరు సంఘం నాయకులు, మహిళలు భారత ప్రధాన నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ పట్టణంలోని స్థానిక కమల నిలయంలో వారికి కండువాకప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..
ఇప్పుడు ఎంపీ అర్వింద్ పసుపు రైతులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి స్పయిస్ బోర్డు తెచ్చారు. దాంతో పాటు జాతీయ పసుపు బోర్డు తీసుకువచ్చి పసుపు రైతులకు అండగా నిలిచారు.ఆనాడే పసుపు బోర్డు తెచ్చి ఉంటే పసుపు సాగు పెరిగేది కదా?అన్నీ ఏండ్లు ఎంపీ గా కొనసాగిన ఎందుకు పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదుపసుపుకు అన్యాయం చేసింది కవిత గారు? బీఅర్ఎస్ నాయకులు కాదా?ఎన్నికల్లో హామీ ఇచ్చింది వస్తవం కాదా? అప్పుడే తెచ్చి ఉంటే పసుపు సాగు, ఎగుమతి పెరిగేది కదా ఇప్పటివరకుసబ్సిడీ లను ఎత్తి వేసి రైతు బంధు 10వేల రు. ఇస్తున్నారు.నిజంగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం బీఅర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు.