బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నయని బీఆర్ఎస్ పార్టీ డిజిపికి ఫిర్యాదు చేసింది. పోలీసులు తమ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారని తెలిపారు. వారిని భయాంభ్రాంతులకు గురిచేస్తున్నారని.. బైండోవర్లు, కేసులు, ఫోన్లలో బెదిరింపులకు దిగుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర డీజీపిని కలిసి ఫిర్యాదు చేశారు.