తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్య నేతలు, లోక్ సభ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులు ఇప్పుడు బాధ పడుతున్నారని గులాబీ బాస్ అన్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన ఓ కీలక నేత ఇటీవల తనను సంప్రదించాడని.. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా.. అని తనను అడిగారని, అయితే ఇప్పుడే వద్దని ఆయనతో చెప్పానని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే బీజేపీ వారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేశారని అన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ వాళ్లు బ్రతకనిస్తారా.. అని కేసీఆర్ అన్నారు.