Sunday, June 15, 2025
HomeNewsTelanganaKCR: తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి : కేసీఆర్

KCR: తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి : కేసీఆర్

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ‘దాశరథి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి ఇమిడి ఉన్నదని తెలిపారు.

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి రచయిత, దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భబిష్యత్తు తరాలకు నిత్య స్పూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments