Tuesday, March 25, 2025
HomeNewsTelanganaBRS Manifesto 2023 : బీఆర్ఎస్ మేనిఫెస్టో .. తెలంగాణ భవన్ లో విడుదల చేసిన...

BRS Manifesto 2023 : బీఆర్ఎస్ మేనిఫెస్టో .. తెలంగాణ భవన్ లో విడుదల చేసిన కేసీఆర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీ ఆర్ ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు 3 నెలల ముందుగానే టికెట్లు ప్రకటించిన కేసీఆర్.. తాజాగా ఎన్నికలకు
45 రోజుల ముందుగానే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించకముందే ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. బీ ఆర్ ఎస్ ఎన్నికల మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీ ఆర్ ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో — 2023

తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధంచేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నం. వెనుకబడేయబడ్డ
తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె – ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నం. బడ్జెట్‌ ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయినం. జీఎస్టీపీ రెండున్నర రెట్లు పెంచినం.
తలసరి ఆదాయం పెంచినం. సంక్షేమానికి — అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇచ్చినం. సంక్షేమంలోనూ, క్యాపిటల్‌ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

  • బెస్ట్‌ ఎకనమిక్‌ పాలసీ
  • బెస్ట్‌ పవర్‌ పాలసీ
  • బెస్ట్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పాలసీ
  • బెస్ట్‌ ఇరిగేషన్‌ పాలసీ
  • బెస్ట్‌ అగ్రికల్చర్‌ పాలసీ
  • బెస్ట్‌ దళిత్‌ పాలసీ
  • బెస్ట్‌ వెల్ఫేర్‌ పాలసీ
  • బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ
  • బెస్ట్‌ హెల్త్‌ పాలసీ
  • బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ
  • బెస్ట్‌ హౌసింగ్‌ పాలసీ

విజయవంతంగా అమలవుతున్న ఈ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగిస్తం. కాలానుగుణంగా ఉద్దీపనలిస్తూ, ఉన్నతీకరించుకుంటం. ఈరోజు బీఆర్‌ఎస్‌ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని కొత్త హామీలు..

అందరికీ సన్నబియ్యం :

  • తెలంగాణ రాంగనే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్‌ బియ్యం కోటాను పెంచుకున్నం. పేదలు సంతోషపడ్డరు.
  • 58500 అధికారంలోకి రాగానే రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాం.

కేసీఆర్‌ బీమా — ప్రతి ఇంటికి థీమా :

రాష్ట్రంలో తెల్లకార్డు ENED, ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్‌ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తాం. వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం.

  • తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ బలోపేతానికి దోహదపడతాం.

ఆసరా పెన్షన్ల పెంపు :

  • విధివంచితులైన OTR, We, దీనార్తులను, అసహాయులను ఆదుకోవడం సామాజిక బాధ్యత.
  • అమెరికా, బ్రిటన్‌ వంటి అగ్ర దేశాల్లోనూ సోషల్‌ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తరు.
  • భారతదేశంలో పేదలకిచ్చే పెన్షన్లు ఒక జోక్‌ లాగా ఉండె. ఎడమ చేతోటి విదిలించినట్లు నామమాత్రంగ 20— 70 రూపాయలు ఇచ్చేది. గరిష్టంగా 200 ఇచ్చిన్రు.
  • అవి కూటికి రాకపోవు, గుడ్డకు రాకపోవు.
  • పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల రూపాయలకు తీసుకపోయింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.
  • ఇవాళ నేను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబజ్జిదారులందరికీ ఒక తీపికబురు చెబుతున్నా…
  • బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
  • ఆసరా పెన్ష్నన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకపోతమని హామీ ఇస్తున్నా.
  • ఇపుడు మనం ఇచ్చుకుంటన్నది- 2,016 రూపాయలు
  • మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతం – అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటం.
  • ఐదు సంవత్సరాలల్ల 5 వేల రూపాయలకు పెంచుతమని హామీ ఇస్తున్న.
  • దివ్యాంగుల పెన్షన్‌ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినం.
  • రాబోయే ఐదేళ్లల్ల 6,016 రూపాయలకు పెంచుతమని హామీ ఇస్తున్నాం.
  • దీనివల్ల రాష్ట్ర ఆర్టిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత, బాధ్యతతోని మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలిస్తున్నాం.

రైతుబంధు సాయం పెంపు :

  • దేశంల రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచన ఎవ్వరు చేయలేదు.
  • రైతుబంధు సృష్టికర్తనే బీఆర్‌ఎస్‌
  • ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదు – మ్యానిఫెస్టోలో పెట్టింది కాదు.
  • రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలెనని ఆలోచించి, నిబద్ధతతో, నిజాయితీతో రైతుబంధు పథకం తెచ్చినం.
  • కనుక, పెట్టింది మేమే – పెంచేది మేమే
  • ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం – ఎకరానికి ఏటా 10,000 రూపాయలు
  • రీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్న.
  • వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ… గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నాం.
  • ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం.

అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి :

  • బీఆర్‌ఎస్‌ మొదటినుంచీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది.
  • చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే అందిస్తున్నది.
  • ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నాం.
  • బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తుందని హామీ ఇస్తున్నాం.

400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకం :

  • కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను విపరీతంగా పెంచి, సామాన్యుల మీద మోయలేని భారం వేస్తున్నది.
  • ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్‌ఎస్‌ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తున్నది.
  • బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం.

ఆరోగ్వశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు :

  • బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సామాన్యులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధికశాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నది.
  • ఇపుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉంది. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం.

*జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు.

పేదలకు ఇండ్ల స్థలాలు :

  • రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్‌ఎస్‌ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం.
  • ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్‌ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తాం. అగ్రవర్ధ పేదలకు రెసిడెన్షియల్‌ స్కూళ్లు :
  • తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్‌ విద్యకు పెద్దపీట వేస్తున్నది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నది.
  • రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం.
  • అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం.

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు :

  • రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సౌంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం.
  • సీపీఎస్‌ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం. నివేదిక ఆధారంగా నిర్ణయం
    తీసుకుంటాం.

అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ

*ASSIGNED LANDS WILL BE FREE FROM HOLD

*MINORITY WELFARE WILL BE INCREASED

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments