ఈ నెల 27 వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీజేపీ విజయం సాధించాలని, విద్యావంతులకు, మేధావులకు బీజేపీ గొంతుక కావాలని కేంద్ర మంత్రి, బీజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. భువనగిరి వివేరా హోటల్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అథిదిగా కిషన్ రెడ్డి హాజరై, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.