Tuesday, March 25, 2025
HomeNewsTelanganaరైతు సమస్యలపై బీజేపీ నేతల వడ్ల కల్లాల సందర్శన

రైతు సమస్యలపై బీజేపీ నేతల వడ్ల కల్లాల సందర్శన

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ రణభేరీ మోగించింది. ఒకవైపు 6 గ్యారంటీల అమలుపై వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన బీజేపీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా రణభేరీ మోగించింది. అందులో భాగంగా బీజేపీ నేతలంతా తమ తమ ప్రాంతాల్లో వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకత్వంప్రక్రుతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వడ్లను కల్లాల వద్దకు తీసుకొచ్చి రోజలు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న తీరును కల్లాల సందర్శన ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్శహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు వడ్ల కల్లాలను సందర్శించాలని కోరారు. తద్వారా పంట నష్టం వివరాలను సేకరించడంతోపాటు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని, సన్నాలు, దొడ్డు అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాలని కోరారు. దీంతోపాటు రైతు భరోసా కింద వచ్చే వానాకాలం సీజన్ నుండి రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చేదాకా సర్కార్ పై వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని సూచించారు.

రైతులకు ఇచ్చిన హామీలతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమని ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. వీటితోపాటు 6 గ్యారంటీల అమలుకు మరో రూ.లక్ష కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. ఈ నిధులను సమీకరించడంతోపాటు 6గ్యారంటీల అమలు కోసం విధివిధానాలను రూపొందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంవల్ల రాష్ట్ర ప్రజలతోపాటు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయారన్నారు. పండించిన వడ్లను కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఉండిపోయారన్నారు. ఈ సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవడంతోపాటు వడ్లను కొనుగోలు చేసే వరకు, బోనస్ ఇచ్చే వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

అందులో భాగంగా రేపు(శనివారం) వడ్ల కల్లాలను సందర్శించాలని ఆదేశించారు. ఎల్లుండి(ఆదివారం) అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతులు పడుతున్న బాధలను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. అలాగే సోమవారం (20) అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో తహిసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయాలని ఆదేశించారు. అదే విధంగా ఈనెల 21న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన దీక్షలు చేపట్టాలని కోరారు. అయినా ప్రభుత్వం దిగిరాని పక్షంలో బీజేపీ చేపడుతున్న ఆందోళనను మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments