సెప్టెంబర్ 17ను కేంద్రప్రభుత్వం ఈసారి కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 17వతేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో రిహార్సల్ తో పాటు కవాతు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. లక్ష్మణ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తామని అనడం అంటే అది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహించే వేడుకలకు హాజరు కాకూడదనే ముందుగానే కేంద్ర మంత్రును సీఎం రేవంత్ ఆహ్వానిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ప్రభుత్వమే నిర్వహించాలని లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.