తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణం అయినా కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్‌కు కోవర్టులున్నారని ఆరోపించారు.