ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. మిగిలిన రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరామని వారు తెలిపారు.