ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. గత కొన్నిరోజులుగా ఆమె పార్టీని వీడుతారని వార్తలు వచ్చాయి. తాజాగా బుధవారం తన రాజీనామా లెటర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డ్డికి పంపించారు. విజయశాంతి గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా ఆమె రాజీనామా చేశారు. అయితే, విజయశాంతి కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది.