కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. డా.టీ ఎన్ వంశా చంద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆ స్థానానికి లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరుగబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించింది.