భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం దేవాలయం వెలుపల ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం బాగా జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు, దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.