జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొడవటూరు గ్రామంలోని స్వయంభూ సిద్దేశ్వర స్వామి దేవస్థానం సిద్ధులగుట్టను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుట్టపై వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆయనను శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. శివరాత్రి రోజున సిద్దుల గుట్టను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరున్ని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఏఎంసి చైర్మన్ బానుక శివరాజ్ యాదవ్, చేర్యాల చైర్మన్ నల్ల నాగుల శ్వేతావెంకన్న, మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే నాని బాబు, అముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నరు.