భారత రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి గుండు సుధారాణి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. నలుమూలల నుండి మహిళా సోదరీమణులు తెలంగాణ భవన్ కు చేరుకొని బతుకమ్మలను పేర్చి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ మహిళా నేతలు తెలంగాణ భవన్ కు చేరుకొని మొదటగా బతుకమ్మ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకున్నారు.
బిఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ మరియు జిడబ్ల్యుఎంసి (GWMC) మేయర్ గుండు సుధారాణి, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు సామల హేమ , సునీత, వనం సంగీత, మంజులా రెడ్డి, శాంతి శేఖర్, మాజీ రీజినల్ ఆర్గనైజర్ విజయ రెడ్డి, సుశీల రెడ్డి, ప్రభారెడ్డి , పద్మావతి, మరియు gwmc కార్పరేటర్ లు షీబా, అరుణ, చందన, మరియు నిర్మలారెడ్డి, శోభ గౌడ్ తదితర బిఆర్ఎస్ మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.