ప్రకృతిని పూజించే పువ్వుల పండుగ మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ వేడుకలు దేశ విదేశాలలో ఉంటున్న తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా బతుకమ్మలను పేర్చి.. ఉయ్యాల పాటలతో ఘనంగా పండుగ జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. వాడ వాడలా బతుకమ్మలను ఒక వద్దకు చేర్చి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామంలోని ఎల్లమ్మ చెరువు, పోల్కమ్మ చెరువు వద్దకు బతుకమ్మలను తీసుకెళ్లారు. డీజే బతుకమ్మ పాటలతో యువతులు నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. ఆతరువాత బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.