తనను ఓడించేందుకు ఒక వర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్ ప్రజల దమ్ము చూపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి చేతుల మీదుగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.