...

Bandi Sanjay: కూన శ్రీశైలంపై దాడిని ఖండించిన ఎంపీ బండి సంజయ్

“ఆయన పేరేమో వివేకానంద. చేష్టలేమో ఔరంగజేబు లెక్కున్నయ్. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దాడులకు తెగబడుతున్నరు. మా సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దు. మా బీజేపీ ఒక్కో కార్యకర్త శివాజీ మాదిరిగా మారితే…. మిమ్ముల్ని ఔరంగజేబును తరిమినట్లుగా ఉరికించి ఉరికించి కొడతారు. ప్రజల కోసం అన్నీ భరిస్తున్నం. ప్రజలే మిమ్ముల్ని తరిమికొట్టేందుకు సిద్ధమైనరు” అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు మధ్యాహ్నం కుత్బుల్లాపూర్ విచ్చేసిన బండి సంజయ్ కుమార్ బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలం గౌడ్ ను పరామర్శించారు. నిన్న ఓపెన్ డిబేట్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి వివేక్ వ్యవహరించిన తీరు, జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూన శ్రీశైలంతోపాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బీజేపీ నేతలు జె.సంగప్ప, రవి కుమార్ యాదవ్, చీకోటి ప్రవీణ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

బండి సంజయ్ కామెంట్స్:

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నయ్. ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్, మరో సెక్షన్ మీడియా మాత్రం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటోంది. ప్రజలు మాత్రం బీజేపీకి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపట్ల నమ్మకంతో ఉన్నారు.

ఎన్నికల సమయంలో అధికార పార్టీ వాళ్లు ఏం చేశారో చెప్పుకోవచ్చు. ఇతర రాజకీయ పార్టీలు సైతం వాళ్ల విధానాలను వివరించడంతోపాటు అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నించే హక్కుంది. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నోళ్లు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని భావించే వాళ్లు ఇదే పంథాను అనుసరిస్తారు.

కానీ దురద్రుష్టమేమిటంటే… నిన్న కుత్భుల్లాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యవహరించిన తీరు దుర్మార్గం. ఆయన పేరేమో వివేకానంద… చేసే పనులన్నీ ఔరంగజేబు మాదిరిగా ఉన్నయ్. అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదు. భూకబ్జాలు చేసినవి చెప్పుకోలేడు.

ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ గెలుపు ఖాయమని దాదాపు అన్నీ సర్వేలు చెబుతున్నయ్. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కండకావరంతో బలుపెక్కి ప్రజలంతా చూస్తున్నారనే ఇంగిత జ్ఝానం కూడా లేకుండా భౌతిక దాడికి పాల్పడుతున్నడు. నేను పైసలు పడేస్తా… మీరు గెలిపించాలి. లేకుంటే దాడులు చేస్తానని బెదిరిస్తున్నడు. ఆయనకు వ్యాపారులు, ఇండ్లు, జాగాలు కొన్నా వాటా ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నడు.
ప్రశ్నిస్తే ఇట్లా దాడులు చేస్తానని కుత్బుల్లాపూర్ ప్రజలకు ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్నడు. ప్రజలంతా ఆలోచించుకోవాలి.

వివేకానంద పిట్ట పిల్లలాగ ఉన్నడు. కూన శ్రీశైలం తల్చుకుంటే నలిపి వేయొచ్చు. కానీ ఆ పని చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న శ్రీశైలం ప్రజల కోసం అన్నీ భరిస్తున్నడు. దాడి చేసినా గల్లా పట్టినా సహించిండు. సంస్కారబద్దంగా ఉన్నడు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా సంస్కార హీనంగా లేడు.

బీజేపీ కార్యకర్తలు సంస్కారాన్ని పక్కన పెడితే ఉరికించి ఉరికించి కొడతారు. కానీ మా సహనాన్ని పిరికితనంగా భావించొద్దు. ప్రతి కార్యకర్త శివాజీలా మారి ఔరంగజేబులను తరిమికొట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలను తరిమికొడతారు.

బీజేపీ కార్యకర్తలు పేదల పక్షాన కొట్లాడుతున్నం. కేసులు పెట్టి, అరెస్టులు చేసినా బెదరలేదు. జైలుకు పంపినా భయపడలేదు.

బీఆర్ఎస్ నేతలు తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టినా మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. గత ఎన్నికల్లో కేసీఆర్, ఆయన కొడుకు ముఖం పెట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ నేతలు.. ఇయాళ తల పట్టుకుంటున్నరు. ఎందుకంటే వాళ్ల ముఖాలను చూస్తే జనం థూ అని ఉమ్మేస్తున్నరు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను గోస పెట్టినరు. ఇది గమనించి బీఆర్ఎస్ అభ్యర్థులు సొంత ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నరు.

అయితే బీఆర్ఎస్ నేతలది యధారాజా: తధారాజా పరిస్థితి. కేసీఆర్ ప్రాజెక్టులు, భూ దందాలతో వేల కోట్లు సంపాదిస్తే.. ఇక్కడున్న కింది స్థాయి లీడర్లు భూ కబ్జాలు, అవినీతితో దండుకుంటున్నరు. ఇట్లాంటి వాళ్లను చూసి ఛీ కొడుతున్న జనం వాళ్లకు ధైర్యమిస్తూ అండగా ఉంటున్న కూన శ్రీశైలం గౌడ్ ను గెలిపించుకునేందుకు చూస్తున్నరు.

ప్రజలంతా ఆలోచించాలి. మిమ్ముల్ని దోచుకునేటోడు, కమీషన్లు దండుకునోటోడు కావాలా? మీ తరపున పోరాడే కూన శ్రీశైలం గౌడ్ కావాల్నా? ఆలోచించుకోవాలి.

కూన శ్రీశైలం గౌడ్ పేదరికం నుండి వచ్చిండు. పేదల బాధలు తెలుసు. వివేకానంద బలిసి కొట్టుకుంటున్నడు. రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నరు. కండకావరంతో బీజేపీ అభ్యర్థిపై కళ్లు నెత్తికెక్కి దాడి చేసిన విషయాన్ని తెలంగాణ సమాజమంతా చూసింది.

తెలంగాణ ప్రజలారా…. మీ తీర్పే ఫైనల్. పొరపాటున గూండాకు ఓటేసి గెలిపిస్తే.. తరువాత తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు. భూకబ్జాలు చేసినా, కమీషన్లు దండుకున్నా, దాడులు చేసినా నాకు ఓటేసి గెలిపించారనే అహంకారంతో కనబడ్డ ప్రతి ఇంటిని కబ్జా చేస్తరు. ఖాళీ స్థలం కన్పిస్తే ఆక్రమించుకుంటరు. అపార్ట్ మెంట్లు కడితే వాటా ఇవ్వాల్సిందే.

అసలు తెలంగాణ దేనికోసం సాధించుకున్నం? ఇందుకోసమేనా? నిన్న దాడి చూసిన జనమంతా థూ అంటున్నరు. కుత్బుల్లాపూర్ కు ప్రజాస్వామ్యవాదులు, సోషల్ మీడియా యోధులు వచ్చి కూన శ్రీశైలం గౌడ్ ను గెలిపించేందుకు సిద్ధమైతున్నరు. తద్వారా బీఆర్ఎస్ గూండాలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైనరు.

నేను పోలీసులను, ఇంటెలిజెన్స్ అధికారులను అడుగుతున్నా… భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చిన తరువాత కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఎమ్మెల్యే ఇంటి దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు పెడతారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్ కు ఎందుకు భద్రత ఇవ్వరు? ప్రమోషన్లకు, పోస్టింగులకు కక్కుర్తిపడి వ్యవహరించడం ఎంత వరకు సమంజసం?

పోలీసులు, అధికారులు ఆలోచించుకోవాలి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. తప్పుడు పనులు చేసే అధికారులు, పోలీసులపై చర్యలు తప్పవు. ఇకనైనా వ్యవహారశైలిని మార్చుకోవాలి. రిటైర్డ్ అయిన కొందరు అధికారులు ఇంకా సీఎంఓలు పనిచేస్తూ పైసలు పంపుతున్నరు. గిట్టని వాళ్లను బెదిరిస్తూ కేసులు పెట్టిస్తున్నరు. వ్యాపార సంస్థలను బెదిరిస్తున్నరు. మీరెన్ని చేసినా మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం.

తెలంగాణ ప్రజలారా…. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? నిర్ణయించుకోవాలి. దాడి చేసిన వ్యక్తిపై కేసు పెట్టాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందే. అందుకోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

Share the post

Hot this week

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

Topics

వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ కోటి రూపాయల విరాళం

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్...

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి...

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ...

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

BJP Membership Drive: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership...

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాగుల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా అప్రమత్తంగా...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.