ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపంచారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు చూశాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపికి బిఆర్ఎస్ దాసోహం అయ్యిందని అన్నారు. హరిష్ రావు, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని వివర్శించారు. బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని… ఇక విలీనం ఒక్కటే మిగిలి ఉందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపంచారు.