హైదరాబాద్ లోని మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు. తమకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందన అన్నారు. గత కొన్నేళ్లుగా కనీసం రికార్డులు రాసేందుకు పుస్తకాలను కూడా ప్రభుత్వం సప్లై చేయటం లేదని అన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు సరిగ్గా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జీతం గౌరవ వేతనం రూపంలో వస్తోందని.. తమకు ప్రతినెలా జీతం ఇవ్వాల్సిందిగా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.