తెలంగాణలోని పది యూనివర్సిటీలలో వీసీ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవి కాలం ముగియడంతో ఈరోజు ఇంచార్జీ వీసీల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది. వీరి పదవీకాలం ముగిసేలోపే కొత్త వీసీల ప్రక్రియ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల చేయలేక పోయామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త వీసీలను నియమించే అవకాశం ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ – దాన కిషోర్
జేఎన్టీయూ – బుర్ర వెంకటేశం
కాకతీయ – వాకాటి కరుణ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – రిజ్వి
తెలంగాణ వర్సిటీ – సందీప్ సుల్తానియా
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ – శైలజ రామయ్యర్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ -నవీన్ మిట్టల్
శాతవాహన యూనివర్సిటీ – సురేంద్రమోహన్
జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ – జయేష్ రంజన్
పాలమూరు యూనివర్సిటీ – నదీం అహ్మద్