చేర్యాల, వనపర్తి రోడ్డు, దేవరకద్ర మరియు చొప్పదండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గ సభ్యులను మరియు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
చేర్యాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నల్లనాగుల శ్వేత, వైస్ చైర్ పర్సన్ గా కమిడి జీవన్ రెడ్డిని , వనపర్తి రోడ్డు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్ పర్సన్ గా తిరుపతి రెడ్డిని , దేవరకద్ర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎం. కటలప్ప, వైస్ చైర్ పర్సన్ గా హన్మంత్ రెడ్డిని, మరియు చొప్పదండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కొత్తూరి మహేష్, వైస్ చైర్ పర్సన్ గా మునిగాల రాజేందర్ లను మరియు నూతన పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా మంత్రి తమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 19 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించాం. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీలను నియమిస్తాం’’ అని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేస్తూ, మార్కెట్ యార్డులలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని, మార్కెటింగ్ పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం వారి బాధ్యత అని గుర్తుచేశారు.