తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగాఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in లో అందుబాటులో ఉంచడం జరిగింది. టీ.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ , సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచడం జరిగింది. అర్హులైన వారు తేదీ.18.01.2024 సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్-లైన్, ఈ-మెయిల్ secy-ser-gad@telangana.gov.in ద్వారా అందచేయాలని తెలిపారు. ఈ నియామకాలు, స్వీకరించిన దరఖాస్తుల నుండి, లేదా ఇతరత్రా గాని, ప్రభుత్వం ద్వారా నియమించిన సెర్చ్ కమిటీ లేదా స్క్రీనింగ్ కమిటీ ద్వారా చేయబడునని నేడు విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో తెలిపారు.