ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల చెక్ ను అందజేశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్ లోని సీఎం రేవంత్ నివాసంలో ఆయనను కలిసి విరాళం అందించారు. ఇటీవల వరదల సందర్బంగా తెలంగాణకు పవర్ స్టార్ కోటిరూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
