NewsTelanganaతెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

-

- Advertisment -spot_img

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నందిని సిధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 1 కోటి నగదు పారితోషికం మరియు ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కెటిఅర్ అన్నారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిధారెడ్డి గారు చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుంది అని అన్నారు. తెలంగాణ కోసం కోటిరూపాయాలను, ప్లాట్ ను తిరస్కరించిన సిధారెడ్డి గారి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అల్వాల్‌లోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్, సిధారెడ్డి ఉద్యమకాల స్మృతులను నెమరు వేసుకున్నారు.


ప్రభుత్వమే తెలంగాణ అస్ధిత్వంపైన కుట్రలు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడ్డి గట్టి సందేశం పంపారని కెటిఅర్ అన్నారు. “తెలంగాణ బిడ్డలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైన వెనకాడరని, సిధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్థిత్వ దాడులపై చర్చ జరగింది. “ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన, అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. “తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారు,” అని కేటీఆర్ అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you