పశు సంవర్థకశాఖలో కీలక ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీలో అక్రమాలపై నమోదయిన కేసులను ఏసీబీకి ప్రభుత్వం అప్పగించింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయంపై పలు ఆరోపణల కేసు.. పశుసంవర్థక శాఖ ఆఫీస్ లో ఫైల్స్ మాయం కేసు.. ఈ రెండు కేసులను ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.