కొండా రెడ్డి పల్లి గ్రామం మరియు కొడంగల్ టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి నిర్వహించారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, తాను నివాసం ఉండే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని గాలికి వదిలేశాడని, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అన్నారు. కానీ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతీ గల్లికి రోడ్లు వేయించారని, అలాగే ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా సౌకర్యం కల్పించారని, రోడ్డు పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా జరిగి ఉన్నాయని, మరిన్ని రోడ్లు తమ గ్రామంలో వేయాలని గ్రామస్తులు కోరినట్లు, గ్రామస్తులంతా అత్యధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నరేందర్ రెడ్డిని ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రి గా చేసుకుని, మరిన్ని అభివృద్ధి పనులు గ్రామంలో చేసుకుంటామని తెలిపారని అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మేనిఫెస్టోలో కొత్త పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని అన్నారు.