సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామానికి చెందిన ఉల్లెంగల వెంకటేష్ (34) అనే యువకుడు కొద్ది రోజులుగా కాలి గాయంతో బాధడుతున్నాడు. దీనికి తోడు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (సోమవారం) ఉదయం మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ తండ్రి కూడా చనిపోయాడు. వెంకటేష్ మరణించడంతో కుటుంబసభ్యుల గుండెలు అవిసెలా ఏడుస్తున్నారు. మృదు స్వభావి, స్వౌమ్యుడు, అందరితో ఆప్యాయంగా మాట్లాడే వెంకటేష్ ఇక లేడు అనే వార్తను ఎవరూ కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంత చిన్న వయసులో వెంకటేష్ మరణించడం బాధాకరమని బంధువులు, గ్రామస్థులు అంటున్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.
స్నేహితుల నివాళులు..
వెంకటేష్ మరణవార్తతో స్నేహితులు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. అందరితో సన్నిహితంగా ఉండే తమ మిత్రుడు ఇక లేడు అనే మాట వినగానే స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
బాల్య మిత్రుల చేయూత…
వెంకటేష్ 2003-04 గ్రామంలోని హైస్కూల్ పదోతరగతి క్లాస్ మెట్స్ బాల్య మిత్రులు అనే వాట్సప్ గ్రూప్ ద్వారా అందరూ కూడా వెంకటేష్ మరణ వార్తను తెలుసుకొని, అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరికి శక్తికి మించిన సాయం వారు చేయాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు.