సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆకునూరు గ్రామంలో కురుమల ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప కామారతి కల్యాణానికి బీర్ల వారు (ఒగ్గు పూజారులు) ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12:36 ని.లకు బీరప్ప కామరాతి కళ్యాణం నిర్వహించనున్నారు. మార్చి 30 నుండే పండుగ ప్రారంభం అవుతుంది. వారం రోజుల పాటు జరిగే మహంకాళి, బీరప్ప, కామారాతి, చౌడలమ్మ పండుగ కురుమ, యాదవులకు అత్యంత విశిష్టమైన పండుగ.
దాదాపు 5 దశాబ్ధాల తర్వాత ఆకునూరు గ్రామంలో బీరప్ప పండుగ జరగడం సంతోషంగా ఉందని కురుమ, యాదవ కులస్తులు అంటున్నారు. నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలోనే పండుగ నిర్వహిస్తామని కులస్తులు తెలిపారు. మార్చి 17 ఆదివారం రోజున పాలు నెయ్యి కార్యక్రమం నిర్వహించి, దేవుని కళ్యాణానికి ముహూర్తం ఖరారు చేశారు.