నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్ సైడ్ వాల్‌ను ఢీ కొట్టింది..ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో, డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టు సమాచారం. దీంతో ట్రాక్ మీద నుంచి కిందకి రైలు బోగీలు జరిగాయి. రైలు.. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్పల్పంగా గాయ పడ్డారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది..