Menu

  • Home
  • జాతీయం
  • నమాజ్ చేస్తున్న ముస్లింలపై పూలవర్షం కురిపించిన హిందువులు
Hindus-shower-flowers-on-Muslims-offering-prayers

నమాజ్ చేస్తున్న ముస్లింలపై పూలవర్షం కురిపించిన హిందువులు

దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో రంజాన్ రోజున ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జైపూర్ లోని ఢిల్లీ రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద రోడ్డుపై ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో వచ్చి నమాజ్ చేస్తుండగా హిందూ ముస్లిం ఐక్యతా కమిటీ ఆధ్వర్యంలో కాషాయ దుస్తులు ధరించిన హిందువులు మేడ పై నుంచి వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం హిందూ ముస్లింల మద్య ఉన్న ఐక్యతకు నిదర్శనమని అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share the post

Also Read..