తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు 15వ తేదీ బుధవారంతో ముగిసింది. 119 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 2,298 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి అత్యధికంగా 4,798 మంది నిమినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలనలో 608 నామినషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం 2,898 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. బుధవారం వరకు నామినేషన్ల ఉపసంహరనణ గడువు ఉండడంతో, ప్రధాన పార్టీల అభ్యర్ధులు రెబల్స్ ను, ఇండిపెండెంట్ అభ్యర్ధులను బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరణ చేయించగలిగారు. అత్యధికంగా గజ్వెల్ లో 70 మంది, కామారెడ్డిలో 44 మందితో కలిపి మెత్తం 600 మంది క్యాండిడేట్లు తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. చివరకు 2,298 మంది ఎన్నికల్లో పోటీలో నిలిచారు.