రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మెత్తం 4,798 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల పరిశీలన, స్క్రుటినీలో 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ అవలేదు. ముఖ్యంగా ఇండిపెండెంట్ల అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బీఎస్పీ పార్టీకి చెందిన 8 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించలేదు. నామినేషన్లను అధికారులు పరిశీలించిన తర్వాత 2,989 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అత్యధికంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నుండి 114 మంది బరిలో నిలిచారు. రెండవ స్థానంలో మేడ్చల్ నుండి 67 మంది, కామారెడ్డి నుండి 58 మంది, ఎల్బీనగర్ నుండి 50 మంది, అతి తక్కువగా నారాయణపేట నియోజకవర్గం నుండి 7 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.