ప్రజా భవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను ఆ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నించారని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు.